Wednesday, October 15, 2008

నాకు నచ్చిన సైట్ 'దట్స్ తెలుగు' డాట్ కామ్

తెలుగులో నాకు నచ్చిన కొన్ని వెబ్ సైట్లలో ముఖ్యంగా చెప్పుకోదగినది 'దట్స్ తెలుగు' డాట్ కామ్. సాధారణంగా జర్నలిస్టులు ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఫలానా అక్షరంతో మొదలయ్యే మూడు అక్షరాల పేరున్న హీరోయిన్","ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు"- అంటూ దోబూచులాడుతూఉంటారు. అందరికీ తెలిసిన విషయాల్లో కూడా ఈ ఫేక్ సస్పెన్స్ ఇరికించి, అదే డిగ్నిఫైడ్ జర్నలిజం అనుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి హిపోక్రసీలు ఏవీ లేకుండా ఉన్నదున్నట్టుఫ్రాంక్ ‍గా రాయడంలో దట్స్ తెలుగు సైట్ కి మించింది ఏదీ లేదని నా అభిప్రాయం. అయితే అప్పుడప్పుడు దట్స్ తెలుగు కూడా చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాల రివ్యూల విషయంలో కొంచెం పక్షపాత ధోరణి కలిగి ఉందని నాకు అనిపిస్తుంది. అఫ్ కోర్స్, అది నిజం కావచ్చు, కాకపోవచ్చు కూడా. ఏదేమైనా నూటికి తొంభై ఏడు శాతం నిక్కచ్చిగా నిష్కల్మషంగా సూటిగా రాసి పారేసే దట్స్ తెలుగు స్వభావం నాకు నచ్చుతుంది‍. మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే తెలుగులో మీకు నచ్చిన వెబ్`సైట్స్ గురించి,ఆవాటి మీద మీ అభిప్రాయం గురించి సంక్షిప్తంగా రాయండి. ఇక్కడ ప్రచురిద్దాం. చర్చిద్దాం. ఇందువల్ల ప్రతి తెలుగువాడూ మంచి తెలుగు సైట్ల గురించి సులువుగా తెలుసుకునే వీలు కలుగుతుంది.

1 comment:

వీరుభొట్ల వెంకట గణేష్ said...

రమారమి ఒక పది సంవత్సారాల క్రితం, ఈనాడు ఆదివారం పుస్తకంలో, హాకింగ్ గురించి ఒక వ్యాసం వచ్చింది. ఆ వ్యాసం రాసిన వక్కలంక కిశోర్ గారేనా మీరు? I still have that article laminated. I was very much motivated by that article and eventually took CSE in Engineering thinking that I can become an hacker after graduation, how foolish!! It's really nice to meet you through the blog. That essay was the main motive for me to take up computers!!