తెలంగాణ వస్తే తెలంగాణ సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితోపాటు అనేకమంది తెలంగాణ నేతలు ప్రకటించారు. అంటే తెలంగాణ సీమాంధ్రులు రక్షణ అవసరమైన పరిస్థితిలో ఉన్నారనేది వారు పరోక్షంగా అంగీకరిస్తున్నారు. ఎలాంటి రక్షణలు కల్పిస్తామనేది ఎవరూ చెప్పడం లేదు. రక్షణ అంటే కేవలం భద్రత కాదు. జీవచ్ఛవాల్లా బతికి ఉండే హక్కు కాదు. తెలంగాణ సీమాంధ్రుల ప్రాణాలు, ఆస్తులు, ఉద్యోగాలతోపాటు ఆత్మగౌరవానికి, సంస్కృతీ సంప్రదాయాలకు, భాషకు, ప్రతీకలకు అన్నింటికీ రక్షణ కావాలి.
ప్రత్యేక తెలంగాణ అనేది ఒక న్యాయమైన డిమాండ్.ఒప్పందాల ఉల్లంఘన, తెలంగాణ భాషాసంస్కృతులకు జరిగిన అన్యాయం దృష్ట్యా ఇతర ప్రాంతాలవారు కూడా ఎంతో కొంతమేర ఈ విషయాన్ని అంగీకరిస్తారు. ప్రత్యేక తెలంగాణ విషయంలో గత ఏడేళ్లుగా మోస పు మాటలతో నెట్టుకువచ్చిన ఢిల్లీ పెద్దలు ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరి ప రిస్థితుల్లో ఇరు ప్రాంతాల నాయకులతో వారు చర్చలకు సిద్ధమవుతున్నారు.
అయితే తెలంగాణ సమస్య కేవలం తెలంగాణకు, లేదంటే సీమాంధ్రకు సంబంధించినదేనా? సీమాంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడినవారి సంగతేమిటి? వారికి ఈ చర్చల్లో ప్రాతినిధ్యం ఉందా? అనేది అసలు ప్రశ్న. 2009 డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఆ ప్రకటన పూర్తి ఏకపక్షమని, దానిని రూపొందించింది టీఆర్ఎస్ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని ఇటీవల ఆయన మరణానంతరం బయటపడింది.
సీమాంధ్ర ప్రయోజనాల గురించి కాకపోయినా, ప్రతిస్పందన గురించి కూడా ఏమాత్రం పట్టింపు లేని ఆ ప్రకటన తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేయలేకపోయింది. స్టేక్ హోల్డర్స్ అందరినీ పరిగణనలోకి తీసుకోకుండా వెలువరించే నిర్ణయాలు సంక్షోభానికే తప్ప సమస్య పరిష్కారానికి దారితీయవని అది రుజువు చేసింది. మళ్లీ ఇ ప్పుడు కూడా అలా ంటి పొరపాటే జరి గే ప్రమాదం కనిపిస్తోంది. తెలంగాణ, సీమాంధ్రలే తప్ప తాజా చర్చల్లో తెలంగాణ సీమాంధ్రులకు (సీమాంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో నివసిస్తున్నవారు... సంక్షిప్తంగా తెసీలు) ప్రాతినిధ్యం లేదు. వారి తర పున మాట్లాడే నాయకులే లేకపోవడంతో భవిష్యత్తులోనూ వారికి ఈ చర్చల్లో ప్రాతినిధ్యం లభించే అవకాశాల్లేవు.
వాస్తవానికి తెలంగాణ ఏర్పడితే అందరికంటే ఎక్కువగా ప్రభావితమయ్యేది తెసీలే. కానీ వారిక్కడ మైనారిటీలో ఉన్నందువల్ల, వారికి నాయకత్వం లేనందువల్ల తమ గళాన్ని వినిపించలేకపోతున్నారు. కొన్ని చిన్న తెసీ గ్రూపులు తెలంగాణకు మద్దతు ప్రకటించగా, మిగతావారు ఏం మాట్లాడలేక భయంభయంగా గడుపుతున్నారు. బంద్‌లు, రాస్తారోకోలు, విగ్రహాల ధ్వంసాలు, వాహనాల దహనాలు, కోదాడ గోడలు, భాగో వంటి ప్రకటనలు, 'సీమాంధ్ర కాలనీలపై అగ్గిపుల్ల' వంటి సాహిత్యాలతో భీతిల్లుతూ క్షణమొక యుగంగా కాలం వెళ్లదీస్తున్నారు.
'తెలంగాణకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం' అంటూ ప్రభుత్వ కార్యాలయాల్లోకి వచ్చి తెలంగాణ వాదులు నినాదాలు చేస్తుంటే తెసీ ఉద్యోగులు భీతిల్లిపోతున్నారు. రేపు తెలంగాణ ఏర్పడితే తమ ఆస్తులకు, ఉద్యోగాలకు, ఆత్మగౌరవానికి భద్రత ఉంటుందా అని ఆందోళన చెందుతున్నారు. సీమాంధ్రుల పిల్లలు ఇక్కడే పుట్టిపెరిగినా తెలంగాణవారు కాబోరని, వారికి ఇక్కడ ప్రభుత్వోద్యోగాలు ఇవ్వకూడదని సాక్షాత్తూ కోదండరామ్ స్థాయి నేతలే ప్రకటించడంతో తమ పిల్లల భవిష్యత్తేమిటని తెసీలు భయపడుతున్నారు.
తెలంగాణ వస్తే తెసీలకు రక్షణ కల్పిస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితోపాటు అనేకమంది తెలంగాణ నేతలు ప్రకటించారు. అంటే తెసీలు రక్షణ అవసరమైన పరిస్థితిలో ఉన్నారనేది వారు పరోక్షంగా అంగీకరిస్తున్నారు. కానీ ఎలాంటి రక్షణలు కల్పిస్తామనేది ఎవరూ చెప్పడం లేదు. రక్షణ అంటే కేవలం భద్రత కాదు. జీవచ్ఛవాల్లా బతికి ఉండే హక్కు కాదు. తెసీల ప్రాణాలు, ఆస్తులు, ఉద్యోగాలతోపాటు ఆత్మగౌరవానికి, సంస్కృతీ సంప్రదాయాలకు, భాషకు, ప్రతీకలకు అన్నింటికీ రక్షణ కావాలి.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చేమాటయితే తెసీల రక్షణ కోసం ఈ కింది చర్యలు అత్యవసరం అనేది నా భావన.
* తెలంగాణలోకి సీమాంధ్రుల ఎంట్రీ పాయింట్లయిన కోదాడ, నాగార్జునసాగర్, ఆలంపూర్ వంటి చోట్ల తెలంగాణ సీమాం«ద్రుల (తెసీ)తో కూడిన ప్రత్యేక పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయాలి. ఆయా హైవేల వెంబడి, రైల్వే ట్రాక్‌ల వెంబడి ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఇటువంటి పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలి. పండుగల సమయాల్లో ఈ స్టేషన్లకు అదనపు తెసీ బలగాలను కేటాయించాలి.
* తెసీలను వారి ప్రాంతం, సంస్కృతి, కులమతాలు, భాష/యాస పేరుతో దూషించినా, దాడి చేసినా తీవ్రమైన నేరంగా పరిగణించి కఠినంగా శిక్షించాలి. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం తరహాలో ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్, మైనారిటీ కమిషన్ తరహాలో తెసీ కమిషన్ ఏర్పాటు చే యాలి. దీనికి తెసీ న్యాయమూర్తిని చైర్మన్‌గా నియమించాలి.
* తెసీ ఉద్యోగుల పట్ల ప్రాంతీయ వివక్షకు సంబంధించిన ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు ముఖ్యమైన ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇద్దరు తెసీ, ఒక తెలంగాణ అధికారితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలి.
* ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వల్ల తెలంగాణలో ఉద్యోగాలు కోల్పోయే అవకాశమున్న తెసీ ఉద్యోగులందరికీ సీమాంధ్ర ప్రభుత్వం/ప్రభుత్వాల్లో తప్పనిసరిగా అదే హోదా, జీతంతో ఉద్యోగాలు కల్పించాలి. అంతవరకూ వారు తెలంగాణలోనే అదే ఉద్యోగంలో కొనసాగేందుకు అవకాశం ఇవ్వాలి. ఒకవేళ సీమాంధ్రలో వారికి ఉద్యోగం కల్పించడంలో ఏదైనా సమస్య తలెత్తితే వారిని రిటైరయ్యే వరకూ తెలంగాణలోనే కొనసాగించాలి. ఆ తర్వాత ఆ పోస్టులో తెలంగాణ వారిని నియమించుకోవచ్చు. ం తెలంగాణలో పుట్టిన, ఏడేళ్లు విద్యాభ్యాసం చేసిన వారందరినీ విద్యా, ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణవారిగానే పరిగణించాలి.
* తెసీ సంస్కృతి, సాహిత్యం, భాషలు, విగ్రహాలు వంటి వాటి పరిరక్షణ, విస్తృతి కోసం తెలంగాణ ప్రభుత్వంలో సీమాంధ్ర సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉండాలి. దీనికి బడ్జెట్లో కొంత శాతం నిధుల్ని విధిగా కేటాయించాలి.
* తెలంగాణలోని భూముల్ని ఆక్రమించుకున్న సీమాంధ్ర పెట్టుబడిదారుల భూముల్ని ప్రభుత్వం సా«్వధీనం చేసుకోవాలి. అయితే దానివల్ల ఉపాధి కోల్పోయే తెసీలకు ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించాకే ఆ పని చేయాలి. పదిమందికి మించి ఉద్యోగాలు కోల్పోయే అవకాశమున్న ప్రతి కేసులోనూ ఇద్దరు తెసీ, ఒక తెలంగాణ అధికారితో కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక ప్రకారమే చర్యలు చేపట్టాలి.
* చలనచిత్ర పరిశ్రమ రక్షణ కోసం ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలి. పత్రికలు, టీవీ చానళ్లు, వెబ్సైట్లు తమకు నచ్చిన భాష/యాసలో రాసేందుకు, మాట్లాడేందుకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. భాష/యాస, ఉద్యోగుల ప్రాంతీయత (రాష్ట్రీయత) కారణంగా ప్రసార మాధ్యమాల మీద దాడులు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలి.
* తెలంగాణ, సీమాంధ్రల మధ్య అంతర్రాష్ట్ర వివాదాలు తలెత్తినప్పుడు తెసీతో సహా తెలంగాణలోని ప్రజలంతా సహజంగా తెలంగాణ వైపే నిలబడాలి. అయితే దేశ విస్తృత ప్ర యోజనాల దృష్ట్యా ఎలాంటి అభిప్రాయాన్నయినా చెప్పేందుకుఆయా రంగాల తెసీ నిపుణులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి.
సీమాంధ్ర ప్రజల ధన మాన ప్రాణాలు, భాషా సంస్కృతుల పరిరక్షణకు ఉద్దేశించిన పై డిమాండ్లు సక్రమంగా అమ లు కావాలంటే వారికి తెలంగాణలో తగిన రాజకీయ ప్రాతి నిధ్యం ఉండాలి. అందుకోసం ఈ కింది ఏర్పాట్లు అవసరం.
* తెలంగాణలో 21 ఎమ్మెల్యే సీట్లను, మూడు ఎంపీ సీట్లను తెసీలకు రిజర్వు చేయాలి.
* తెలంగాణ కేబినెట్లో ఉపముఖ్యమంత్రి, రెండు మంత్రి పదవులను తెసీలకు రిజర్వు చేయాలి. ఈ ముగ్గురిలో ఒకరు ఎస్సీ/ఎస్టీ అయి ఉండాలి. సీమాంధ్ర సంక్షేమ మంత్రిత్వ శాఖను ఈ ముగ్గురిలో ఒకరికి కేటాయించాలి.
* సీమాంధ్ర పెట్టుబడిదారులు తమ స్వప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ రిజర్వుడు సీట్లలో పోటీచేయడానికి అవకాశం ఉండకూడదు. అందువల్ల రూ.20కోట్లపైగా ఆస్తులున్నవారిని తెసీ సీట్లలో పోటీకి అనర్హులుగా ప్రకటించాలి.
* తెలంగాణలోని తెసీలందరికీ రెండు ఓట్లు ఉండాలి. ఒకటి ఇతర ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు, ఒకటి తెసీ (రిజర్వుడు) ప్రతినిధులను ఎన్నుకునేందుకు.
* ఈ రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించిన తర్వాతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి.
* గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో 30 శాతం సీట్ల ను, డిప్యూటీ మేయర్ పదవిని తెసీలకు రిజర్వు చేయాలి.
* తెసీ అనే పదాన్ని నిర్వచించేందుకు బయటి రాష్ట్రాల న్యాయనిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలి. ఒక వ్యక్తి తెసీ హోదాపై వివాదం ఏర్పడిన పక్షంలో బయటి రాష్ట్రానికి చెందిన జడ్జి చైర్మన్‌గా గల జ్యుడీషియల్ కమిటీకి నిర్ణయాధికారం ఉండాలి. ఇందులో ఇద్దరు తెలంగాణవా రు, ఇద్దరు తెసీ న్యాయమూర్తులు సభ్యులుగా ఉండాలి. తె లంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని సంప్రదించిన మీదట కేంద్రం ఈ కమిటీ చైర్మన్‌ను నియమించాలి.
తెలంగాణలో వివిధ రంగాల్లో స్థిరపడిన తెసీల పరిరక్షణ కోసం ఇంకా ఎలాంటి చర్యలు అవసరమనేది ఆయా వర్గాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించి నిర్ణయించాలి. ఈ అంశాలన్నింటినీ భారత రాజ్యాంగంలో ప్రత్యేక అధికరణగా పొం దుపర్చాలి. అప్పుడే తెలంగాణలోని సీమాం«ద్రుల ధన, మా న, ప్రాణాలకు, సంస్కృతీ సంప్రదాయాలకు, ఆత్మగౌరవానికి తగిన రక్షణ లభిస్తుంది. ఇలాంటి చర్యల ప్రస్తావన, తెసీల ప్రమేయం లేకుండా కేవలం తెలంగాణ, సీమాంధ్ర ప్రతినిధులతో చర్చించి తీసుకునే నిర్ణయం ఏకపక్షమే అవుతుంది.
- వక్కలంక రమణ
1 comment:
To Know entire Latest Today Breaking AP online News, India, Telangana, Hyderabad, Amaravathi current News, Andhra Pradesh Politics headlines, AP Online Telugu Updates, Tollywood, Cinema News, Sports news etc. Click here
Post a Comment